వంటింటి నిర్వహణలో ఇప్పుడు జీరో వేస్ట్ పద్ధతి అనుసరిస్తున్నారు ఎంతో మంది.కిచెన్ లో ఒలికి పోయిన ఆహార పదార్థాలు తుడిచేందుకు పేపర్ కు బదులు పాత నూలు వస్త్రం వాడాలి దాన్ని శుభ్రం చేసి తిరిగి వాడుకునే వీలు ఉంటుంది.ప్లాస్టిక్ బ్యాగ్ ల వాడకం తగ్గిస్తూ కిరాణా దుకాణానికి వెళ్లేప్పుడు క్లాత్ బ్యాగ్ ను వెంట తీసుకుపోవాలి.ఎక్కువగా రెడీ టూ కుక్ ఫుడ్ తినటం తరచూ సూపర్ మార్కెట్ కు వెళ్లటం మానుకోవాలి. నెలకు లేదా, వారానికి సరిపోయే వస్తువులు ఒకేసారి తెచ్చుకోవాలి వంట గదిలోని కంపోస్ట్ ఎరువు తయారు చేసుకొని చిన్న ట్రే లలో కూడా ఆకు కూరలు పండించవచ్చు మిగిలిపోయిన కూరగాయ ముక్కలను పండ్ల తొక్కలు,పాడైన ఆహారం గుడ్డు పెంకులు ఇంటి ఆవరణలో ఒక గుంట లో వేసి కప్పెడితే సేంద్రియ ఎరువు తయారవుతుంది.
Categories