గ్రీన్ టీ పొడి తయారీలోనే కొన్ని ప్రత్యేక పద్దతులు ఉంటాయి. తేయాకు మొగ్గ ఆకులను,మొగ్గలను లేత చిగుళ్ళను తెంపాక వాటిని ఎండబెడతారు.కోసిన ఆకులు టీ పాట్ లో మనకు తే నీరుగా వచ్చే వనరు ఎన్నో ప్రక్రియలకు లోనవుతాయి. తేమ లేకుండా ఆక్సికరణం చెందించి ఆవిరి పైన వేడి చేయడం వేడిగా ఉన్న పెద్ద పాన్ లలో పొడి చేయడం ద్వారా ప్రాసెస్ చేస్తారు.ఈ ఆకులను ఆవిరి పైన ఉడికించటం ద్వారా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఉంటాయి. కొంచెం పసరు వాసనలు రుచిగా ఉండదు కాని ఆరోగ్యప్రయోజనాలలో ఔషధ గుణాలతో ఇతర రకాల టీలకంటే అద్భుతమైంది. ఇందులోని పాలిఫినాల్స్ అనే దాతువు శరీరంలోని కణజాలాన్ని దాని పై నిరంతరం దాడి చేసే ప్రీరాడికల్స్ నుంచి కాపాడుతుంది. చర్మ సౌందర్యం మెరుగవుతుంది. చర్మంలోని ఎలాస్టిక్ కణజాలాన్ని ఆరోగ్యంగ ఉంచుతుంది.
Categories