Categories
చర్మ సంరక్షణలో రోజ్‌వాటర్ ఎంతో ముఖ్యం అందాన్ని పెంచే రోజ్‌వాటర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.రోజ్ వాటర్ కోసం కొన్ని గులాబీ పూలు డిస్టిల్ వాటర్ స్ప్రే బాటిల్ తీసుకోవాలి ముందుగా గులాబీ రేకులను వేరుచేసి కంటెనర్ లోకి తీసుకుని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి ఇలా చేస్తే వాటి పైన ఉన్న క్రిమిసంహారకాలు తొలగిపోతాయి. గులాబీరేకులు గిన్నెలోకి తీసుకొని అన్ని మునిగేలా డిస్టిల్ వాటర్ పోయాలి ఇప్పుడా గిన్నెను స్టవ్ పైన పెట్టి మరిగించాలి. అరగంట తర్వాత గులాబీ రేకుల పైన ఉన్న రంగు పోతుంది అప్పుడిక రోజ్‌వాటర్ తయారైనట్లే ఈ రోజ్ వాటర్ వడబోసి స్ప్రే బాటిల్ లో పోసి ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు.