తహిర్ సలహోవ్ రష్యన్ పెయింటర్. ఆయన సోదరి జారీఫా సలహోవా. అజర్ బైజాన్ రాజధాని నగరం బాకు లో ఈమె మినియేచర్ బుక్స్ మ్యూజియం ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఒకేఒక మినియేచర్ బుక్స్ మ్యూజియం ఇదే. 30 ఏళ్ల పాటు కష్టపడి అజేరా రష్యన్ ఇంగ్లీష్ జర్మన్ వంటి ఎన్నో భాషల్లో వున్న గొప్ప గొప్ప రచయితల పుస్తకాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. 17వ శతాబ్దం నాటి మినియేచర్ ఖురాన్ ప్రతి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇదే అత్యంత పురాతనమైనది. సైజులో అత్యంత చిన్నదైన దిమోస్టు మిరాక్యులస్ థింగ్ అన్న రష్యన్ పుస్తకం కూడా ఇక్కడే వుంది. దీన్ని మాగ్నిఫయింగ్ గ్లాసెస్ ఉపయోగించి చదవాలి. ఈ బాకు మ్యూజియం లో 6500 పుస్తకాలున్నాయి. 64 దేశాల నుంచి వీటిని కలెక్ట్ చేసింది జరీఫా సలహోవా. రేపటి తరంకోసం సాహిత్యాన్ని సంస్కృతినీ భద్రపరిచి వారికి అందించాలన్నది తన ఉద్దేశమని చెప్పారు జరీఫా. ఆమె స్వయంగా కొన్ని మినియేచర్ పుస్తకాలు ప్రచురించారు కూడా. CHUKOVSKY , BARTO, GOGOL, DOSTO YEVSKY , AS PUSHKIM వంటి మహామహులు రాసిన అపురూపమైన పుస్తకాలూ కూడా ఇక్కడున్నాయి. అన్ని ఇమేజెస్ చూడండి.
Categories