గర్భవతిగా వున్నప్పుడు, డెలివరీ దాటాక కుడా జుట్టు బాగా రాలిపోతుందని చాలా మంది కంప్లయింట్ చేస్తూ ఉంటారు గర్భవతిగా ఉన్నపుడే ప్రోటీన్స్ ఖనిజాలు ఐరన్ అధికంగా వున్న ఆహారం తీసుకుంటే సమస్య చాలావరకు తగ్గిపోతుంది. ఇక ప్రసవం తర్వాత జుట్టు వుదిపోవడం చాలా సహజం. అయితే మూడు నెలల తర్వాత సమస్య తగ్గుతుంది. అప్పటికి తగ్గక పొతే డాక్టర్ సలహా తీసుకోవచ్చు. రోటీన్ గా శిరోజాల ద్రుడత్వం కోసం చేసే మసాజ్ లు, క్రమం తప్పని హెయిర్ బాత్ లు తప్పని సరిగా చేస్తూ వుండాలి. కాకపోతే విటమిన్ సప్లిమెంట్స్ వంటివి మాత్రం గర్భిణీ గా వున్నప్పుడు తీసుకోకూడదు. రెగ్యులర్ చెకప్స్  లో డాక్టర్ సూచించిన మందులు ఆహార నియమాలు మాత్రం పాటించాలి. ప్రసవం తర్వాత ఊడిపోయిన జుట్టు చాలా కొద్ది కాలంలోనే పెరుగుతుంది. ఆ విషయంలో గాబరా పడనక్కరలేదు.

Leave a comment