Categories
ధ్యానం జీవితానికి మరింత విలువని ప్రసాదిస్తోంది అంటున్నారు యోగా గురువులు . ధ్యానం అంటే సమగ్రత ధ్యానం వల్ల మనసుకి ప్రశాంతత లభిస్తుంది . ధ్యానంలో మనశరీరం స్థితిని సంబంధించిన ఎరుక మన మనసుకు తెలుస్తుంది . ఇది వృద్ధులకోసం కానేకాదు . అన్ని వయసుల వారికీ ముఖ్యంగా ఎంతో ఉత్సాహంలో ఎన్నెన్నో పనులు ఒకే సారి చేయాలని ఆశపడే యువతకు ఏకాగ్రత ఇస్తుంది . ఏ సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ఆత్మ విశ్వాసం పట్టుదల ఇస్తుంది .ఎలాగంటే ఐదు నిమిషాలు ఏకాగ్రతలో ఏదీ ఆలోచించకుండా మనసుని శూన్యంగా ఉంచుకోగలిగితే అంతకు ముందు మనసులో ఏర్పడ్డ స్ట్రేస్ , ఆరాటం , కోపం , ఆతృత వంటి భావనలు మాయం అవుతాయి అంటున్నారు యోగా గురువులు .