Categories
ఎంత వయసొచ్చినా ఆ ఏజ్ తాలూకు ఏ లక్షణం కనిపించకుండా మాయచేసేది చక్కని ఆహారం. యాంటీ ఆక్సిడెంట్స్ ఆధారంగా వుండే పండ్లు, కూరగాయలు, నట్స్, గింజలు, డ్రై ఫ్రూట్స్, పాలు , చీజ్, పన్నీర్, పప్పులు ఇవన్నీ తినాలి. ముఖ్యంగా మన దేశపు ఔషధ గుణాలు పుష్కలంగా వున్న హెర్బ్స్ , పునరుత్తేజాన్ని ఇచ్చే మైక్రోబియల్స్ గుణాలు వున్న పానీయాలు తాగడం వళ్ళను, ఉసిరి, జమ , కమలా , నారింజ , బొప్పాయి పండ్లు తీసుకోవాలి. డ్రై ఫిగ్స్, రైజన్స్, ఖర్జురాలు , పీచు, కాల్షియం, మెగ్నీషియం , ఐరన్ , విటమిన్ సి కి చక్కని ఆధారాలు . అలాగే మంచి ఆహారం తో పాటు క్రమం తప్పని క్రమశిక్షణ తో కూడిన వ్యాయామం తోడైతే శరీరం మాట వింటుంది.