అరటి తొక్క కదా అని విసిరి పారేస్తా. అలా పారేయాలి ఇది మొక్కలకుఎంతో మేలు చేస్తుంది అంటారు వ్యవసాయ శాస్త్ర వేత్తలు. అరటి పండు తొక్కలు బాగా ఎండ బెట్టి పొడిగా చేసి మొక్కలున్న తొట్టిలో నెలకోసారి కష్ట జల్లుకున్నా చాలు మంచి ఎరువుగా వుపావుగాపడుతుంది. ఒక బాక్స్ లో మట్టి పోసి అందులో అరటి తొక్కలను కలిపేసి పెడితే అందులో  వుండే పోషకాలు వారం లోపే మట్టి లో కలుస్తాయి. అందులో విత్తనాలు, మొక్కలు నాతుకోవచ్చు. ఒక బకెట్ లోని నీళ్ళలో అరటి తొక్కలు పడేసి బాగా నాని పోయాక ఆ నీళ్ళను మొక్కలకు పోస్తే ఆరోగ్యం గా పెరుగుతాయి. ఈ తోక్కల్లో పోటాషియం, ఫాస్పరస్ సమృద్దిగా వుంది మొక్కలకు ఎరువుగా మారతాయి.

Leave a comment