డి-విటమిన్ కావాలా? అయితే పుట్ట గొడుగులు తినండి అంటున్నారు వైద్యులు. యాంటి ఆక్సిడెంట్లు ఇతరత్రా పోషకాలు అనేక కూరగాయలు పండ్ల లో దొరుకుతాయి. కానీ డి-విటమిన్ పుష్కలంగా దొరికే శాఖాహార పదార్ధం పుట్టగొడుగు ఒక్కటే. మన శరీరం ఎలా డి-విటమిన్ తాయారు చేసుకుంటుందో అదే మాదిరిగా ఇందులో వుండే ఎర్గో స్టెరాల్ అనే ప్రో-విటమిన్ అతి నిలలోహిత కాంతిని గ్రహించి డి-విటమిన్ గా మారుతుంది. ఆరు బయట పెరిగే పుట్టగోడుగుల్లో డి-విటమిన్ చాలా తక్కువ శాతం పాలు, ఇతరాత్రా ఉత్పత్తులలో వుండే డి-విటమిన్ డి-3 రూపంలో వుంటే పుట్టగోడుగుల్లో డి-2 రూపంలో దొరుకుతుంది. సుప్లిమెంట్లు కూడా డి-3 విటమినే అందిస్తాయి. కాబట్టి శరీరంలో డి-2 శాతం చాలా తక్కువ గా వుంటుంది. రెండింటిని పోల్చి చుస్తే డి-3 కన్నా డి-2 శరీరానికి ఎంతో మంచిది. గుండ్రంగా మందంగా వుండే బటన్ పుట్టగొడుగుల కన్నా పలుచని రేకుల్లా వుండే ఆయిన్టర్ రకంలోనే డి-విటమిన్ అధికం. ఆహారంలో ఎంత వీలైతే అంత చేర్చితే మంచిది.

Leave a comment