ఇంటీరియర్స్ చలా ఖరీదు. ఒక సారి కొన్ని వస్తువులు కొన్నాక, ఇక మాటి మాటికీ మార్చాలంటే కుదరదు. కానీ రోజు ఇల్లు ఒకేలా వుంటే బోర్ గా వుంటుంది. మరి కస్త మార్పు తేవాలంటే బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, సోఫా కవర్స్ ఇలాంటివి మార్చుతూ వుండాలి. పడక గది నీట్ గా వుండాలంటే పిల్లో కవర్స్ కొత్త కొత్త డిజైన్ల తో రంగులతో ఉండేలా తీసుకుంటే అవి ఎప్పుడు మార్చేస్తూ వుంటే ఫ్రెష్ లుక్ వస్తుంది. మంచి రంగులు ఎంపిక చేసుకోవాలి. పిల్లో కవర్స్ రంగు, డిజైన్, ఫ్యాబ్రిక్ పరిగణలోకి తీసుకోవాలి. గది ధీమ్ ను బట్టి బెడ్ రూమ్ దుప్పట్లు, పిల్లో కవర్స్ ఎంపిక చేయాలి. గది అందం పెంచడం లో కుషాన్ కవర్స్ బాగా ఉపకరిస్తాయి. డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్ లో కుషన్స్, కవర్స్ అమర్చు కుంటే ఆకర్షనియంగా వుంటుంది. ఎంబ్రాయిడరీ వర్క్ మోడల్స్ లైవ్ లీ ప్రింట్స్ వేసిన కవేర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉంటున్నాయి. ఇంటీరియర్ ఫర్న్ బార్ ను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయమైన ఆ కట్టు కొనే పిల్లో కవర్స్ బెడ్ షీట్స్ కుషన్ కవర్స్ ఎంపిక చేయడం మంచిది. ఇంటికి గ్రాండ్ లుక్ వస్తుంది.
Categories