ముంజేతి కింద చర్మం నల్లగా అయ్యిపోయి తర్వాత స్కిన్ లైటనింగ్ సాధ్యం కాదనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అధిక బరువు, స్వేదం, తరచూ వ్యాక్సింగ్, షేవింగ్, డియోడ్రెంట్ స్ప్రే ల వాడకం, వంటివి ముఖ్య కారణం. సహజంగా చర్మం రంగును తేటగా చేసే రోల్ ఆన్ డియోడరెంట్స్ వాడితే ఇవి చర్మం నల్లబడటాన్ని కొంత తగ్గిస్తాయి. నిమ్మరసం, బంగాళ దుంప లేదా కీరదోసల్ని ప్రతి రోజు పది నిమిషాల పాటు ఉంచితే సహజ బ్లీచింగ్ కారకాలుగా పని చేస్తాయి. చందనం పొడి, రోజ్ వాటర్ కలిపిన ప్యాక్ అప్లయ్ చేసి ఇరవై నిముషాలు ఆగి కడిగేయాలి. రెండు టేబుల్ స్పూన్ పాలు, టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ సేనగ పిండి, కొద్ది చుక్కల తేనె కలిపి పేస్టు చేసి అప్లయ్ చేసి పదిహేను ఇరవై నిమిషాలుండి కడిగేయాలి.

Leave a comment