శరీరానికంతటికీ వ్యాయామం కావాలనుకునేవారు కళ్ళకు అలాగే వ్యాయామం కావాలని రియలైజ్ చేసుకోరు .ఇతర కండరాలు మాదిరే కళ్ళకు వ్యాయామం కావాలి తాజాగా అలసట లేకుండా ఉండాలి అంటే కొన్ని వ్యాయామాలు కావాలి.కళ్లపై అరచేతులను కప్పింగ్ చేస్తూ నెమ్మదిగా ప్రెజర్ ఇస్తుండాలి. ఇలాంటి ప్రెజర్ ను ఆరు సెకన్లు ఇవ్వాలి. మరో ఆరు సెకన్లు అరచేతులను రిలాక్స్ చేయాలి. ఇది చక్కని ఒత్తిడి నివారిణిగా పనిచేస్తుంది. ఫోకస్ వ్యాయామం వల్ల ఫోకస్ చేసే శక్తి పెరుగుతుంది. ఓ దారానికి చిన్న బాల్ బిగించి వదలాలి అది ఊగుతూ ఉంటుంది కళ్ళను కేవలం బాల్ పైనే ఫోకస్ చేయాలి. ఇలా రెండు సార్లు అరనిముషం చొప్పున చేయాలి జ్ఞాపక శక్తి,ఫోకస్ వంటివి పిల్లల్లో మెరుగుపడేందుకు ఇది ఉపయోగపడుతుంది. కొంచెం చీకటిగా ఉన్న గదిలో కొన్ని వస్తువులు నేలపై వేసి వెతకాలి ఈ వస్తువుల సైజు పింగ్ పాల్ బాల్ నుంచి బటన్ సైజు వరకు ఉండాలి. ఎన్ని తీయగలిగితే అంత స్కోర్ ఉన్నట్లు లెక్క. కంప్యూటర్ స్క్రీన్ ను ఎక్కువ సేపు చూడటం వల్ల కళ్ళకు హాని కలుగుతోంది. ప్రతి రెండు గంటలకు పది నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు కళ్ళ అలసట ఉండదు.
Categories