Categories
వర్షా కాలంలో వచ్చే రుగ్మతులు నుంచి ముఖ్యంగా కరోనా నుంచి రక్షణ పొందేందుకు వ్యాధినిరోధక వ్యవస్థను బలపరిచే ఆహారం తీసుకోవాలి. పండ్లు,కూరగాయలు పొట్టు తో కూడిన ధాన్యాలు పప్పు దినుసులు పాల ఉత్పత్తులు తేలికగా జీర్ణం అవుతాయి. పాలిష్ పట్టని పరిపూర్ణ ధాన్యాలు ఆహారంగా తీసుకొన్నపుడు తేలికగా అరిగి త్వరిత శక్తిని ఇస్తాయి. సేంద్రియ పంటల్లో ఖనిజ లవణాలు విటమిన్లు,పీచు,పుష్కలంగా ఉంటాయి. ఇంట్లో తయారు చేసిన జున్ను,పాలు,కూరగాయలు తో చేసిన వంటకాలు శక్తి ని ఇస్తాయి. జీలకర్ర ,మిరియాలు వంటి దినుసులు జోడించి ఆరోగ్యకరమైన ఆహారం వండి వేడిగా ఉండగానే తినటం ఈ రోజుల్లో చేయదగిన పని.