బంధాలను కలిపేది, అనుబంధాలను నిలిపేదీ సుఖ సంతోషాలతో జీవితాన్ని ఆనందమయం చెయ్యగలిగింది క్షమాగుణం ఒక్కటే ఒక చిన్న మాట పట్టింపు వస్తే దాన్ని పట్టుదలతో సాగదీస్తూ పోతే ఈ విలువైన అనుబంధంగా చేజారిపోయే అవకాశం లేకపోలేదు .తప్పు మన వైపు కూడా ఉండొచ్చు అన్న చిన్న ఆలోచన మనసులో మెదిలితే, లేదా ఒక చిన్న మాట తో అనుబంధ మాయమై పోతుందనే భయం బాధ కలిగితే వెంటనే ఒక చిన్న క్షమాపణలతో బంధాలు తిరిగి బలపడతాయి. మనం రాయి వేసి కొట్టినా ప్రేమతో పండు మన చేతిలో పెట్టగలిగే చెట్టు క్షమాగుణానికి నిలువెత్తు సాక్ష్యం.ఒక చిన్నమాట క్షమించు అని అనగలిగితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అపరాధ భావన తొలగిపోతుంది. ప్రశాంతత కలుగుతుంది.మానసిక ఒత్తిడికి దివ్యౌషధం క్షమాపణ మన పట్ల మనం ఇతరుల పట్ల కానీ కఠినంగా వ్యవహరించడం మనస్సుకి బాధ కలిగిస్తుంది మనుషుల మధ్య అనురాగం పెంచేది ప్రేమ అయితే దాన్ని ఎప్పటికీ నిలిపి ఉండే లక్షణం క్షమాగుణం.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment