నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఏడువేల మంది మహిళల పైన ఒక అధ్యాయనం చేశారు. చాలా మంది ఊపిరితిత్తుల సమస్యతో భాధపడుతున్నారు. ఎందువల్ల అని పరిశోధనల్లో తేలింది ఏంటంటే వాళ్లు ప్రతిరోజు యాసిడ్స్, డిటర్జంట్ల తో ఇల్లు, వంటిల్లు, బాత్ రూమ్ లు శుభ్రం చేయటం. ఇలా చేయటం ఊపిరితిత్తుల పైన పోగ తాగడంతో సమానమైన హాని కలుగుతుందని చెబుతున్నారు. ఇంటిలో గచ్చు, మొండి మరకలు, వంట గదిలో నూనె నిండిన అరుగుల్ని నిరంతరం శుభ్రం చేయటం వలన ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. అంచేత స్త్రీలు ఎప్పటికప్పుడు మొండి మరకలు లేకుండా ఇల్లు శుభ్రం చేసుకోవాలి తేలికైన సబ్బు నీళ్లు వాడుకోవాలని చెబుతున్నారు.

Leave a comment