12 సంవత్సరాల సమైరా మెహతా సంపాదన కోటి రూపాయల పైనే. ఆరేళ్ళ వయసులో తండ్రి రాకేష్ నేర్పిన కోడింగ్ ను స్వయంగా ప్రాక్టీస్ చేసి దాన్ని పిల్లలు కూడా నేర్చుకునేలా బోర్డ్ గేమ్ రూపొందించింది దాని పేరు కోడర్ బన్నీజ్. పిల్లలకు కోడింగ్ లో ప్రాథమిక అంశాలు నేర్పి ఈ నాన్ డిజిటల్ గేమ్ ప్రపంచవ్యాప్తంగా హిట్ అయింది. దీనికి సీక్వెల్ గా తయారు చేసిన కోడర్ మైండ్స్ ప్రపంచంలోనే తొలి కృత్రిమ మేధ లో కూడిన బోర్డ్ గేమ్ గా గుర్తింపు పొందింది. అమెరికా ప్రభుత్వం తో సహా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల నుంచి అవార్డులు ప్రశంసలు పొందిన సమైరా ఇప్పుడు సిలికాన్ వ్యాలీ లో జరిగే లేక్ ఈవెంట్ల లో ప్రసంగాలు చేస్తూ యంగెస్ట్ స్పీకర్ గా చరిత్ర సృష్టించింది.