క్యాబేజీ లో ఔషధ గుణాలున్న దాన్ని వండుతుంటే వచ్చే వాసన చాలా మందికి నచ్చదు దీనితో పాంక్రి యాటిక్ కాన్సర్ ప్రభావం తగ్గించ వచ్చని చెపుతారు. ఆహారంలో భాగంగా తీసుకుంటే అధిక బరువు తగ్గుతుంది. ఈ క్యాబేజీ ని చైనా లో కూడా పండించారు అది సెలెరీ ఆకుల్లాగా వుంటుంది. పొడుగాటి ఆకులతో వుండే ఈ క్యాబేజీ ఎన్నో రంగుల్లో పండిస్తున్నారు. విటమిన్ సి, క్యాల్షియం అధికంగా ఉండే ఈ క్యాబేజీ వండుతూ వుంటే మంచి వాసన వస్తుంది. మాములు క్యాబేజీ వాసన అనుకొనేవాళ్ళు దాన్ని నిచ్చింతగా తినవచ్చు క్యాబేజీ లాగే ఈ క్యాబేజీ కూడా ఎన్నో రకాల కూరలుగా చేస్తారు. ఇప్పుడీ క్యాబేజీ మన ప్రాంతం లోను అన్ని స్టోర్స్ లో దొరుకుతున్నాయి.