కేరళకు చెందిన 25 ఏళ్ల ఆదిత్య నితిన్ గంటలో 910 మందికి గోరింటాకు పెట్టే గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ జనవరి ఒకటిన సి.ఎం.హెచ్. ఎస్ మైదానం లో ఉదయం 9 నుంచి 10 గంటల లోపు 910 మందికి మెహందీ డిజైన్లు చేసింది గతంలో లండన్ కు చెందిన  సామినా హుస్సేన్ గంటలో 600 మందికి మెహందీ డిజైన్ లు వేసిన రికార్డ్ ను కేవలం 37 నిమిషాల్లో దాటేసింది ఆదిత్య నితిన్. గత సంవత్సరం 12 నిమిషాల్లో ఏడు ప్రపంచ వింతలను గోరింటాకు తో ఓకే చేతిపై వేసి ఆసియా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించానని చెబుతోంది ఆదిత్య నితిన్.

Leave a comment