Categories
గుంజన్ l999 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశం కల్పించిన 25 మంది మహిళా ఫ్లైట్ లెఫ్టినెంట్ లలో ఒక్కరూ. l999 లో కార్గిల్ పోరులో పాల్గొని యుద్ధభూమిలో చాపర్ నడిపిన తొలి ఫ్లైట్ లెఫ్టినెంట్ ఈమె సేవలకు భారత ప్రభుత్వం శౌర్య చక్ర ఇచ్చి సత్కరించింది.ఆమె జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించారు.జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా ఎంతో మంది అమ్మాయిలకు ఒక స్ఫూర్తి.కార్గిల్ యుద్ధంలో గాయపడిన వారిని తరలించటం రవాణా సామాగ్రి తరలింపులో సహనం చూపించటం వంటివి ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. ఆమె తండ్రి పాత్రలో పంకజ్ త్రిపాఠి చాలా బాగా నటించాడు.తండ్రిగా కూతురికి వంద శాతం ప్రోత్సాహం ఇచ్చే పాత్ర అది పురుషులకే సొంతంగా ఉన్న కొన్ని ఉద్యోగాల్లోకి అమ్మాయిలు కూడా చాలా తేలిగ్గా రాగలరనీ,శక్తిమంతంగా పని చేయగలరని నిరూపిస్తుంది ఈ సినిమా. అలాగే నిజ జీవిత కథ కూడా గుంజన్ సక్సేనా వంటి అద్భుతమైన అమ్మాయి పాత్రలో జాన్వి చక్కగా ఉంది.
రవిచంద్ర. సి
7093440630