కొన్ని హెయిర్ ఫ్యాక్స్ జుట్టుకు మెరుపును ఇస్తాయి . తాజా కమలా పండ్లరసం కొద్దిగా నీరు,ఒక టేబుల్ స్పూన్ తేనె ,కొద్ది చుక్కలు శాండిల్ ఆయిల్ కలిపి షాంపూ చేసుకున్నాక ఈ మిశ్రమం తో వాష్ చేస్తే జుట్టు నిగనిగలాడుతోంది . కోడిగుడ్డు బీట్ చేసి ,టేబుల్ స్పూన్ పాలు కలపి జుట్టుకు పట్టించి పావుగంట తర్వాత కడిగేస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది . జుట్టు నిర్జీవంగా విస్తారంగా ఉంటే బాగా పండిన అరటి కాయలో కొద్దిచుక్కలు బాదం నూనె కలపి ఆ మిశ్రమంతో జుట్టు మసాజ్ చేసుకొని పావుగంట సేపు ఆగి వాష్ చేస్తే జుట్టు జీవం తో ఉంటుంది . వేడి ఆలివ్ నూనెలో తేనె ,టీస్పూన్ దాల్చిన చెక్క పొడి ,లవంగ పొడి కలసి తలకు పట్టించి అరగంట తర్వాత ఆగి కడిగేసుకోవాలి .

Leave a comment