ప్రముఖ హరికథా కళాకారిణి ఉమామహేశ్వరి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కృష్ణాజిల్లా హుబిలి పట్నంలో పుట్టిన ఉమామహేశ్వరి తెలంగాణ లోని వేములవాడ లో పెరిగారు. 14 ఏళ్ల వయసు లో హరికథ నేర్చుకున్నారు. ఇప్పటివరకు కొన్ని వేల హరికథ ప్రదర్శనలు ఇచ్చారు. దేశం లోని విశ్వవిద్యాలయలు అన్ని ఆమె ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. తెలుగు తో పాటు ఆమె సంస్కృతంలోనూ హరికథ చెబుతారు. 2018 లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. జాతీయస్థాయి కళాకారిణిగా  హరికథ కళకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చారు ఉమామహేశ్వరి.

Leave a comment