దేవతలకే కాదు రాక్షసులకు కూడా గుళ్ళున్నాయి తమిళనాడు,కేరళ ప్రాంతంల్లో రాముడికన్నా ఎక్కువ పూజిస్తారు. ఉత్తరాదిన ఏకంగా హిడింబి కో ఆలయం ఉంది. మహాభారతంలో హిడింబాసురుడి చెల్లెలుగా హిడింబి పరిచయం అవుతోంది. బీముడికి భార్య అవుతోంది. మహావీరుడైన ఘటోత్కచుడి కి తల్లిగా అందరికి తెలుసు ఘటోత్కచుడు పెద్దవాడై రాజ్యపరిపాలన చేయటం మొదలు పెట్టాక హిడింబి హిమాలయాలకు వెళ్ళి తపస్సుచేసింది. దైవశక్తులు పొందింది. కోరికలు తీర్చే దేవతగా మారింది 1553 లో మహారాజ బహద్దూర్ సింగ్ హిడింబి పేరిట ఒక అందమైన ఆలయం నిర్మించారు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే వ్యక్తిగత సమస్యలు ఆపదలు వస్తే ప్రజలు ఈ హిడింబి కి పూజ చేస్తారు … హిమాచల్ ప్రదేశ్ లోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో ఈ హిడింబి గుడి కూడా ఒకటి పగోడా తరహాలో ఈ ఆలయం చాలా అద్భుతంగా వుంటుంది.
Categories