Categories
ప్రపంచం లోని స్వచ్ఛమైన నదుల్లో మేఘాలయా లోని ఉంగోట్ నది మొదటిది(UMNGOT) అట్టడుగున ఉండే ఇసుక కూడా స్పష్టంగా కనిపించే ఈ నది ఒక అద్భుతం మేఘాలయా స్టేట్ లో షిల్లాంగ్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నదిలో ఉన్న బోట్ లను పై నుంచి చూస్తే పడవ గాలిలో తేలినట్లే కనిపిస్తుంది. జలశక్తి మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటోలో చుట్టూ ఆకాశం పచ్చని కొండలు మధ్యలో ఓ పడవ గాలిలో తేలినట్లే కనిపిస్తుంది. నిజానికి ఆ పడవ స్వచ్ఛమైన ఉంగోట్ నదిలో తేలుతుంది. నీటి లో చేపలు, గులకరాళ్ళు పైకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అద్భుతమైన నది ని చూసేందుకు పర్యాటకులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు.