వంద కోట్ల మందికి వాక్సినేషన్ పూర్తయింది.మారుమూల జిల్లాల్లో కూడా ఎంతో కష్టం పైన ప్రయాణాలు చేసి ఈ ప్రక్రియను పూర్తి చేశాను ఎ.ఎన్.ఎం లో రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లా ఎ.ఎన్.ఎం గా పనిచేస్తున్న అనిత ఎడారిలో కొన్ని కిలోమీటర్లు నడుస్తూ వెళ్లి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశారు. తొమ్మిది నెలల చంటి బిడ్డతో ప్రయాణాలు చేసి తనకు అప్పగించిన పని పూర్తి చేసింది అనిత. కొన్ని గ్రామాలకు వెళ్లేందుకు ఎడారిలో నడుస్తూ వెళ్ళటం తప్ప ఇంకో దారి లేదు. అలా కష్టపడి వెళ్లి ఇక్కడి గ్రామాల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ సాధించాను అంటోంది అనిత.అలా ఎడారిలో నడుస్తూ వెళుతున్న అనితా ను సోషల్ మీడియా లో అభినందనలు ముంచెత్తాయి.

Leave a comment