Categories
మహిళలు అందరూ ఒక వయస్సు దాటాక మెనోపాజ్ దశకు చేరుకుంటారు. ఇది అనారోగ్యం కాదు చిట్టచివరి రుతుస్రావం తర్వాత ఓ సంవత్సరానికి ఎదురయ్యే ఒక దశ ఈ దశలో నెలసరి లో మార్పులు వస్తాయి. దీన్ని పెరి మెనోపాజ్ అంటారు. ఈ దశలో శరీరంలో వేడి ఆవిర్లు మూడ్స్ లో మార్పులు చిరాకు డిప్రెషన్ లాంటి లక్షణాలు ఉంటాయి. ఈస్ట్రోజన్ తగ్గి ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య వంతమైన డైట్, వ్యాయామాలు చక్కని ప్రశాంతమైన జీవనశైలిలో కుటుంబ సహకారం తో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు ఏ రకమైన చికిత్సల తోను పని లేదు.