బేకింగ్ సోడా తో సౌందర్యాన్ని కాపాడుకునే చిట్కాలు ఎన్నో ఉన్నాయి.  కాఫీలు, టీలతో నల్లబడిన దంతాలను టూత్ పేస్ట్ పైన ఈ బేకింగ్ సోడా వేసి రుద్దితే తెల్లగా వస్తాయి. కళ్ల కింద నల్లగా అయిపోతే ఈ బేకింగ్ సోడానీళ్ళలో కలిపి అందులో దూది ముంచి నల్లబడిన చోట పది నిమిషాలు ఉంచేస్తే నలుపు తగ్గిపోతుంది.షేవింగ్ తో వెంట్రుకలు తొలగిస్తే ఒక్కోసారి వెంట్రుకలు చర్మం లోపల పెరిగే అవకాశం ఉంది. షేవ్ చేసిన వెంటనే బేకింగ్ సోడా నీళ్ళు కలిపిన మిశ్రమంతో అక్కడ రుద్దితే సరిపోతుంది. పొడి చర్మం ఇబ్బందిపెడుతున్న గోరు వెచ్చని నీళ్ళతో నిండిన టబ్ లో బేకింగ్ సోడా వేసి ఓ అరగంట అందులో కూర్చుంటే చాలు చర్మం తేమగా అవుతుంది.

Leave a comment