ఈ సంవత్సరం మొదట్లో దేశ రాజధానిలో డొనేట్ యువర్ వాల్ పేరుతో ఒక చక్కని ఉద్యమం మొదలైంది. ఇళ్ళ యజమానులు రోడ్డు వైపున వున్న గోడను స్వచ్చంధం సంస్థకు అప్పజెప్పాలి. వాళ్ళు ఆ గోడని కాన్వాస్ గా చేసుకుని అందమైన కళా ఖండాలు ఆ గోడల పైన సృస్టిస్తారు. దీనికి ఏషియన్ పెయింట్స్ ప్రధాన భాగస్వామీ. ఈ రంగుల గోడలు స్థానిక జన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. గోడపైన చక్కని బొమ్మలతో పాటు మంచి సందేశం కూడా వుంటుంది. బయట వైపు వున్న గోడలను సరిగా పట్టించుకోక పోవడంతో వీధిలో కొన్ని గోడలు కళావిహీనంగా, రోడ్లనిండా చెత్త చెదారంతో వుండేది. ఈ కార్యక్రమం మొదలుపెట్టాక గోడల శుబ్రత పెరిగింది. వీధుల్లో చెత్త మాయమైంది. ఢిల్లీ మారుమూల ప్రాంతాలు కూడా చక్కని కళాత్మకమైన బొమ్మలతో సందేశాలతో మేఅరసిపోతున్నాయి. ఈ ఆలోచన హైదరాబాద్, విజయవాడలకు కూడా విస్తరిస్తే గోడలు కళకళలాదిపోతాయి.

Leave a comment