మగ్గాలపైన తయారయ్యే నేత చీరెలకు డిమాండ్ ఎప్పుడు తగ్గదు . బళ్ళారికి చాలా దగ్గరలో ఉన్నా ఇల్కాల్ అనే చిన్నా పట్టణంలో తయారయ్యే తొమ్మిది గజాల ఇల్కాల్ చీరెలు చాలా ప్రసిద్ధి వర్మిలియన్ గిరి కుంకుమ అనే ప్రత్యేక రంగుతో పెళ్ళి దుస్తులు తయారు చేస్తారు . ఇవి సంప్రదాయ సిద్దమైన చీరెలు . నూలు పట్టు మిశ్రమంతో ,చీరెను ఎన్నో డిజైన్ లతో నేస్తారు . ఈ చీరెలో ప్రత్యేకంగా పైటకొంగు విడిగా తయారు చేసి జాయింట్ చేస్తారు . ఐదువేల పోగులతో కూల్ బ్రైట్ కలర్స్ తో నేశాక చిరెకు కొత్త రంగును అద్దుతారు . నైపుణ్యం గల చేనేత కళాకారులు రెండు గంటల్లో ఐదువేల జాయింట్స్ . ఒక మహిళా గంటకు రెండున్నర ముడులు వేస్తారట, మొత్తం చేత్తో ముడులు వేస్తూ నేస్తారు . నూలు దారాల పైన రంగుల సిల్క్ లేదా ఆర్ట్ సిల్క్ పోగుల్ని కలుపుతూ అల్లిక పూర్తి చేస్తారు . చీరపైన కసూటి ఎంబ్రాయిడరీ అదనపు హంగు గా ఉంటుంది . శంఖువులు ,కలువలు,రధాలు ఏనుగులు ,దీపాలు ,దేవాలయాలు వంటి డిజైన్స్ నేస్తారు . సారా నుంచి ఎంబ్రాయిడరీ వరకు ఎన్నో రకాలుంటాయి . చీరలు దీర్ఘచతురస్త్రాలు ,స్కర్స్ తో నాణ్యమైన నూలు పట్టుదారాలతో చేతి మగ్గాల పైనా  ఈ చీరె తయారవుతుంది . ఇప్పుడు పవర్ లూమ్స్ సహాయంతో కూడా ఈ నేతచీరెలు భారీగా తయారవుతున్నాయి . ఇల్కాల్ లో 20000 మంది ఈ చీరె ల  తయారీ పైన ఆధారపడి జీవిస్తున్నారు . ఇలాటి కళాకారుల ను ప్రోత్సహిస్తేనే ఈ కళ కలకలం జీవించి ఉంటుంది .

Leave a comment