Categories
సోషల్ మీడియాలో ప్రతి నిమిషం సెల్ఫీలు పెట్టుకుని అనంద విచారాలు పంచుకోవడం మనుషులకు అలవాటై పోయింది. ఇప్పుడు ఆ వరసలో గ్రామాలు కూడా నిలబడతాయేమో. ఇండోనేషియా లోని ఈ గ్రామం పేరు కంపంగ్ పెలంగి. మొన్న మొన్నటి వరకు మామూలు మట్టి గూడల తోనే వుండేది. ఇప్పుడు త్రీడీ బొమ్మలతో ఏడు రంగులతో ఊరంతామెరిసిపోతుంది. తమ ఊరికో గుర్తింపు తేవాలని పర్యాటక ప్రాంతంగా మార్చాలనే ఉద్దేస్యంతో గ్రామాన్ని రంగులతో ముంచెత్తారు. ప్రభుత్వ సాయంతో గ్రామం లోని 232 ఇల్లు కార్యాలయ భవంతులు, బస్టాపులు, వంతెనలు, వాటర్ ట్యాంకులు అన్నింటికి గ్రామ ప్రజలు రంగులు వేసారు. ఈ పని పూర్తి చేయడానికి నెలరోజులు పట్టిందిట. ఇప్పుడీ గ్రామం ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద అట్రాక్షన్.