ఇల్లు అందంగా అలంకరించుకోవడంలో ఫ్లవర్ వాజ్ లు ఎంతో ఉపయోగ పడతాయి. అభిరుచిల్ని పట్టి ఎన్నో డిజైనర్ ఫ్లవర్ వాజ్ లు దొరుకుతాయి. ఎన్నో రంగుల్లో షెపుల్లో గ్లాస్, క్రిస్టల్, సిరామిక్, బ్రాస్, వుడ్ మార్బల్ స్టోన్ తో చేసిన ఫ్లవర్ వాజ్ లు దొరుకుతున్నాయి.ముందుగా ఎక్కడ వాటిని పెడితే అందంగా ఉంటుంది అనిపిస్తుందో చూసుకుంటే ఎంత సైజులో ఉండాలో టేబుల్, టీపాయ్, టి.వి, డైనింగ్ టేబుల్ పైన పెట్టేవి ఎలాంటివి వుంటే బాగుంటుందో ప్లాన్ చేసుకోవాలి. కలపతో చేసిన వజుల్లో మంగో వుడ్ తో చేసినవి ఆకర్షనీయంగా ఉంటాయి. కార్వింగ్ ఫ్లవర్ వాజ్ లకు డిమాండ్ ఎక్కువే. రాజస్థాన్ నుంచి తెప్పించిన లైట్ వుడ్ తో డిజైన్లు చెక్క తో తాయారు చేస్తారు. బ్రాస్ ఫ్లవర్ వాజ్ లయితే. మెటల్ పైన ఆకర్షనీయమైన డిజైన్లు చెక్కుతారు. మార్బుల్ పాట్ పైన స్టోన్స్ అతికించిన ఫ్లవర్ వాజ్లు వస్తున్నాయి. లగ్జరీ లుక్ రావాలంటే వీటి ఇమేజస్ చుస్తే సరి.

Leave a comment