జుట్టు పట్టుకుచ్చులా మెరిసేందుకు హెయిర్ సీరమ్ రాస్తారు. కానీ రసాయనాలు జుట్టుకు అపకారం చేస్తాయి. ఇంట్లోనే సహజమైన హెయిర్ సిరమ్ తయారుచేసుకోవచ్చు. 100 మిలీ అవిసె గింజల నూనెను, రెండు టేబుల్ స్పూన్ల చొప్పున అవకాడో నూనె, ఆముదం నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కలిపితే హెయిర్ సీరమ్ తయారవుతుంది. పొడి జుట్టు ఉన్న వాళ్ళు పెపర్ మెంట్ ని నార్మల్ హెయిర్ ఉంటే లావెండర్ లేదా రోజ్, జిడ్డు జుట్టు ఉంటే నిమ్మ లేదా చామంతి ఎసెన్షియల్ ఆయిల్స్ ఎంచుకోవచ్చు. అవకాడో లో ఉండే విటమిన్స్ ఆముదం లో ఫ్యాటీ ఆసిడ్స్ అవిసె నూనెలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ వెంట్రుకలు పెరుగుదలకు సాయపడతాయి.

Leave a comment