Categories
WoW

ఇంట్లోనే రెండు ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్

వేసవి వేడి కంటే సెలవులిచ్చిన పిల్లల అల్లరే మరింత కష్టం. చల్లగా తినాలి, చల్లగా తాగాలి. అస్తమానం ఇదే జపం. వాళ్ళకోసం వాళ్ళ పేరుతో పెద్ద వాళ్ళు తినేందుకు గాను HERSHEY’S dual single serve ice cream machine రెడీ గా దొరుకుతుంది. ఎన్ని కావాలంటే అన్నీ ఐస్ క్రీమ్, పాలు, పానీయాల్లో ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్, డ్రై ఫ్రూట్స్  కలిపేసి, ఇష్టమైన పండ్ల జ్యూస్ చేసుకుని మెషీన్ లో కనిపించే కప్పుల్లో పోసేస్తే చాలు. ఇలా స్వీట్ ఆన్ చేస్తే అలా ఐస్ క్రీమ్ తయ్యారై పోతుంది. ఈ మెషీన్ లోని మగ్స్, బ్లేడ్స్ అన్నీ అత్యంత ఆధునికంగా తయ్యారు చేసారు. దీని పై భాగం ఓపెన్ చేయడం, తిరిగి అమర్చుకోవడం, కడిగి పెట్టేసుకోవడం కూడా చాలా ఈజీ ఒకే సారి రెండు రకాల ఐస్ క్రిమ్స్ కూడా తయ్యారు చేసుకోవచ్చు. ఇలాంటి రసాయినాలు కలపకుండా ఇంట్లో పాలు, జ్యూస్ ఫ్లేవర్స్, డ్రై ఫ్రుట్స్ అంతే మనకి ఇష్టమైన ఐస్ క్రీమ్ నిమిషాల్లో రెడీ. ఖరీదు అంత ఎక్కువ ఏమీ లేదు.

Leave a comment