Categories
కాస్త సింపుల్ గా ,హుందాగా ,ఆకర్షణీయంగా కనిపించాలి అనుకొంటే సాలిటెయిర్ డైమండ్ నగలు ఎంచుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఏ మేలిరకపు రాళ్ళ తో అయినా ఒక్క వజ్రంతో కలిపితే మరింత అందంగా ఉంటాయి . సాలిటెయిర్ డైమండ్ పొదిగిన ఉంగరాలు రోజు ధరించేందుకు వీలుగా ఉంటాయి . ఈ డైమండ్స్ ను సేంట్ లతో కొలుస్తారు . రాళ్ళ నాణ్యతను హామీగా జి.ఐ.ఎ ,లేదా ఐ.జి .ఐ. సర్టిఫికెట్ తీసుకోవాలి . ఒంటిరాయితో మెరిసే పెండెంట్లు చాలా చక్కగా ఉంటాయి . చుడీదార్,చీరెలు,స్కర్ట్ ఇలా సంప్రదాయ కట్టు ఆధునిక వస్త్రాలతో అయిన సూటవుతాయి . తక్కువ బరువులో ధగధగమని మెరిసే ఈ వజ్రాల నగల్ని బ్రేస్ లెట్ ,పెండెంట్,ఉంగరం ఈమూడు కలిపిన సెట్ గా కొనుక్కోవచ్చు .