చలికి కూడా మెడ నల్లగా అయిపోతు ఉంటుంది. ఈ నలుపు పోవాలంటే పచ్చి బొప్పాయిని గుజ్జుగా చేసి ,అందులో గులాబీ నీరు పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి ప్యాక్ గంట తర్వాత కడిగేయాలి. ఆలా వారానికి ఒకసారి చేస్తో వుంటేమెడ నలుపుగా ఉండదు. నిమ్మరసం,తేనె మిశ్రమం కూడా బాగా పనిచేస్తుంది. తేనె తేమను అందిస్తే నిమ్మరసం నలుపు పోగొడుతుంది. వంట సోడాలో నీళ్ళు కలిపి ఆ పేస్ట్ ను రాసి ఐదు నిముషాల్లో కడిగేసుకోవాలి. ఆలా చేసిన మెడ నలుపు పోతుంది. సెనగపిండి నిమ్మరసం పాలు మిశ్రమం కూడా మెడ నలుపు పోగొడుతోంది.

Leave a comment