Categories
ప్రతి రోజు సగటున ప్రతి వ్యక్తి దాదాపు 16 గంటలు పాటు కూర్చునే అన్ని రకాల పనులు చక్క బెడుతు ఉన్నట్లు పరిశోధికులు కనిపెట్టారు, ఆరోగ్యాన్ని పెంపొందించుకొనే దిశగా శరీరంలో ఎలాటి కదలికలు లేకపోవటం వల్ల కాలినరాల్లో రక్త ప్రసరణ సాఫీగా జరగక కాళ్ళకు సంబందించిన సమస్యలు వస్తున్నాయి. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోవటం వల్ల మెడ,వెన్నుపాము ముఖ్యంగ వెన్నెముకలో సెర్వైకల్ వెటెబ్రోలో, అంటే కూర్చునేందుకు వీలు కల్పించే వెన్నుభాగం దెబ్బతిని పోతుంది. వెన్నుపాములోని 26 వెన్నుపూసలో కార్టిలేజ్ దెబ్బతింటుంది. ఫలితంగా వెన్నునొప్పి తధ్యం దీని వల్ల కూర్చోవటం మాత్రమే కాదు పాడుకోనేదుకు కూడా బాధ పడవలసి వస్తుందని పరిశోధికులు హెచ్చరిస్తున్నారు