ఇప్పటికే గ్లామర్ పాత్రలు అనేకం చేశాను . పరిశ్రమకు వచ్చి పన్నెండేళ్ళు అయింది . ఇక అవే పాత్రలు వద్దనిపిస్తుంది . గ్లామర్ క్విన్ గానే పేరుతెచ్చుకొన్నాను కదా . మరి ఇన్నేళ్ళ ప్రయాణం తర్వాత ఐటమ్ సాంగ్స్ ఒప్పు కొంటున్నారు ఎందుకు అని అడుగుతున్నారు కానీ నా బలం డాన్స్ . నాకు గుర్తిపు డాన్స్ లోనే . హీరోయిన్ పాత్రలో డాన్స్ కు అవకాశం ఉండదు ఐటమ్ లేదా స్పెషల్ సాంగ్స్ లో ప్రతిభ చూపెట్టే అవకాశాలు ఉంటాయి . అందుకే కాదనను అంటుంది తమన్నా . అయినా నాలోకూడా నాకు నచ్చేది డాన్స్. ఎవరితోనైనా ఎలాటి డాన్స్ అయినా సులువుగా చేసేయగలను . అందుకే కొన్ని డాన్స్ పాటలు మొహమాటానికి ,కొన్ని ఇష్టానికి ఒప్పుకుంటున్నాను . నటిగా గుర్తింపు దొరికే పాత్రలు వస్తే బావుండు ననుకొంటున్నాను అంటుంది తమన్నా .