Categories
కొత్తిమీర వేసిన చారు,పులుసు ,కమ్మని వాసన వస్తాయి. ఏ ఉప్మానో చేసి కొత్తి మీర చల్లితే నోరు ఊరుతుంది. వట్టి రుచికాదు కొత్తి మీర ఆరోగ్య ప్రదాయిని .విటమిన్ బి కాంప్లెక్స్ కు చెందిన బి1,బి2,బి3, బి4,బి5 వంటి అనేక విటమిన్లు కూడా ఎక్కువే. ఈ విటమిన్లు అన్నీ వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చేవే. చర్మానికి నిగారింపును ,దీర్ఘకాలం యవ్వనంగా ఉంచేందుకు కొత్తి మీర ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఖనిజాలు జుట్టును మంచి మెరుపుతో ఉంచుతాయి. చర్మంపైన ముడతలు తొలగిస్తాయి. శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గా కాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది.