అస్తమానం అవే నగలా? కొత్త డిజైన్ లు, మ్యాచింగ్ నగలు మాటిమాటికీ మారుస్తూ వేసుకోగలిగితే ప్రతి ఫంక్షన్ లోనూ మెరిసిపోమా అనుకునే వాళ్ళ కోసం ఈ ఆన్ లైన్ లో అద్దెకిచ్చే నగలు. ఈల్స్ 24 కామ్ ముంబై కి చెందిన రాహుల్ బంకా ప్రారంభించిన ఆన్ లైన్ స్టోర్ జ్యూవెల్ లైబ్రరీ పేరుతో నగలు అద్దెకు ఇస్తోంది. బంగారు వజ్ర భరణాలు తో పాటు రత్నాలు ముత్యాలు పొదిగిన నెక్లెస్ లు హారాలు, గాజులు, దిద్దులు, బ్రేస్ లెట్లు వంటి ఎన్నో నగలు ఫోటోలు ఉంటాయి. వాటిలో మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటే కంపెనీ సిబ్బందే ఇంటికొచ్చి మరీ ఇస్తారు. వీటిని మూడు రోజులు మన దగ్గరే ఉంచుకుంటే నగ విలువలో మూడో నాలుగో శాతం అద్దెగా ఇవ్వవలసి ఉంటుంది.ఎవరిని పడితే వాళ్లను నమ్మలేరు కనుక నగా విలువ కు సరిపోయే డబ్బు ముందే కట్టించుకుంటారు. రెగ్యులర్ గా నగలు తీసుకోవాలంటే ఇందులో మెంబర్షిప్ ఉంటుంది. కొంత డబ్బు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే 8 శాతం వడ్డీ ఇస్తారు. అలాగే అంతకు సరిపోయే నగలు తీసుకోకపోవచ్చు. కెంపులు కుందన్ లు అమెరికన్ డైమండ్ వంటి విలువైన రాళ్లతో చేసిన కాస్ట్యూమ్స్ నగలు కూడా ఎన్నో రకాల్లో దొరుకుతాయి. ఇలాంటిదే రెంట్ జ్యువెల్ కామ్ హైద్రాబాద్ లో పాటు మరో 8 నగరాల్లో డిజైనర్ నగల్ని అందిస్తోంది. కావాలంటే మన ఇంటికి నడిచొస్తాయి.
Categories