జుట్టు రాలిపోవటం, తెగిపోవటం, మెరుపు కోల్పోవటం ఇవన్ని ఆహార లోపం వల్లే రావచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జుట్టు నిర్జీవంగా అయిపోవటానికి ఐరన్ లోపం కావచ్చు. ఇది జుట్టు కుదుళ్ళకు దృఢంగా ఉంచగలుగుతుంది. అలగే బయోటిన్ లోపం కుడా కావచ్చు. ప్రోటీన్ ను విడగొట్టి అమైనో అమ్లాలు గ్లూకోజ్ గా మార్చటంలో దీనిది ప్రాధాన పాత్ర. జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. విటమిన్ -ఇ ని బ్యూటీ విటమిన్ అంటారు. జుట్టును పొడవుగా అందంగా ఉంచుతుంది. బాదం గింజల్లో ఈ పోషకం ఉంటుంది. దిన్నీ ఆహారంలో తీసుకోవచ్చు. అలగే బాదం ఆయిల్ తలకు పట్టించవచ్చు. విటమిన్-ఇ టాబ్లెట్స్ కొబ్బరి నూనెలో కలిపి మాడుకు రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే జుట్టుకు రక్త సరఫరా పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే విటమిన్ సీ కూడా జుట్టును బలంగా మార్చ గలదు.
Categories