టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రీమియర్ పాగా వేసిన కాక ముట్టాయి సినిమా నటుడు ధనుష్ వెట్రిమారన్ నిర్మించారు. ఉత్తమ బాలల చిత్రంగా రెండు నేషనల్ అవార్డ్ లు గెలుచుకోంది. చెన్నై మురికివాడల్లో ఇద్దరు అన్నదమ్ములు తల్లి నాయనమ్మ తో నివసిస్తుంటారు. తండ్రి కారణం లేని జైలు శిక్ష అనుభవిస్తుంటాడు.ఈ ఇద్దరు పిల్లలు రైలు పట్టాల దగ్గర రాలిపడే రాక్షసి బొగ్గు ఏరుకుని  డబ్బు సంపాదిస్తూ ఉంటారు.ఆ పిల్లలు కాకి గుడ్లు తింటూ ఉండటం తో వాళ్ళని కాక ముట్టాయ్ అని పిలుస్తుంటారు.వాళ్లు స్లమ్ దగ్గర మెయిన్ రోడ్ లో ఒక పిజా షాప్ ఓపెన్ చేస్తారు టీవీ లో కనబడే పిజ్జా తినాలనే కోరిక తో పిల్లలు విశ్రాంతి లేకుండా బొగ్గు ఏరి డబ్బులు కూడబెట్టుకుంటారు. తీర షాపు దగ్గరకు పోతే వీళ్ళ మురికి గుడ్డలు చూసి అక్కడి సూపర్వైజర్ పిల్లల్ని కొట్టి తరిమేస్తాడు. అది కాస్త ఫోన్ లో రికార్డు చేస్తారా బయట నిలబడ్డ పిల్లలు దాన్ని మీడియాకు అమ్ముతాడు ఇంకో స్లమ్ వాడు. అది కాస్త వైరల్ అవుతుంది. చివరకు పిల్లలు పిజ్జా తినటం సినిమా. ఎంత గొప్పగా ఉందో సినిమా తప్పక చూడండి హాట్ స్టార్ లో.

రవిచంద్ర .సి  
7093440630  

Leave a comment