కూర్చుని చేసే జాబ్సే అయినా ఆహారీరానికి కదలికలు ఉండేలా శ్రద్ధ తీసుకోగల మర్గాలున్నాయి. శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. మాల్స్ లో ఎస్కలేటర్లు వాడవద్దు. వారంలో రెండు రోజుల పాటు రెసిస్టెన్స్ లేదా స్ట్రేంగ్త్  ట్రైనింగ్ వ్యాయామాలు చేయాలి. ఆఫీసు లో సీట్లల్లో నుంచి మధ్య మధ్యలో లేచి అటు ఇటు తరగతి. ఏదో రకంగా పని మధ్యలో లేస్తుండాలి. సహోద్యోగుల దగ్గరకు నడిచి వెళ్ళి ఏదైనా ఆఫీస్ విషయాలు డిస్కస్  చేయాలి. లంచ్ బ్రేక్ లో పది నిమిషాల వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. క్యాంటిన్ కు, కాఫీ, టీ ల కోసం ఆఫీసులో నుంచి చుట్టూ తిరిగి వెళ్ళే దారులు ఎంచుకోవాలి. అటు ఇటు తిరుగుతూ కుడా సహోద్యోగులతో  మాట్లాడుకోవాచ్చు. ఎక్కువసేపు ఎక్కువ గంటలో కదలకుండా కూర్చుంటే టైప్ టూ డయాబెటిక్  సంబందిత రిస్క్. గుండె రక్త నాళాల సమస్యలు ఎక్కువగా  ఉంటాయి. కోలెస్ట్రోల్, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగటం గ్లూకోజ్ స్ధాయిలు పెరగడం నడుము కొలతలు పెరిగిపోవడం కూడా ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే నష్టాలే.

Leave a comment