సినిమాల్లో ఏడుపు సీన్లోస్తే చాలా ఏడ్చేస్తూ వుంటారు. కొన్ని దయనీయమైన దృశ్యాలను చుస్తే మనసు కరుగుతుందనీ భోరున ఏడవటం బావుండక మనసు బరువెక్కి పోయి మాట్లాడలేకపోతాం. నిజానికి అలంటి సందర్భాల్లో ఏడిస్తే మనసు తేలికవుతుందికూడా కానీ మనం నిబ్బరంతో ఉండటం ఏడుపు మునిపంటితో నొక్కిపెట్టి కనీళ్ల్లు రాకుండా ఎంతో శ్రమతో నిగ్రహించుకుంటాం. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే కనీళ్ళు మానసిక వత్తిడిని తగ్గిస్తాయని శరీరంలో విషతుల్యమైన వాటిని తొలగించి శరీరం స్వస్థత చెందేందుకు సాయపడతాయంటున్నారు. కొన్ని పరిశోధనలు చేస్తే హాయిగా ఏడవ గలిగిన వాళ్ళు శారీరికంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు ఫలితాలు తేలాయి. ఏడిస్తే ఒత్తిడి తగ్గిపోతుంది . మెదడులో నొప్పి నివారణ ఎంజైములు ఎక్కువగా విడుదలవుతాయి. కనుక మనసారా కడుపులో బాధ ఆవిరై పోయేలా హాయిగా ఏడవండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు.
Categories