మనం నిత్యం వాడే ఆహార పదార్ధాల్లో ఎన్నో రకాల కల్తీలు జరుగుతున్నాయి తేలికపాటి పరీక్షతో కల్తీ కనిపెట్టవచ్చు. పాలు కాసిని గిలకొట్టి చూస్తే అందులో ఎక్కువ నురుగు వుంటే కల్తీపాలు అవచ్చు. తెల్లని చ్లంటింగ్ పేపర్ తడిపి,లేదా తడి దూదితో పండ్లు,కూరగాయలు తుడిస్తే కృతిమ రంగు తెలిసిపోతుంది. ఐస్ క్రీమ్ మీద రెండు చుక్కలు నిమ్మరసం కలపాలి. నురగలు వస్తే వాషింగ్ పౌడర్ వంటివి కాలిపినట్లు గుర్తు. మిరియాలు ఆల్కహాల్ లో వేస్తే మునిగితే మంచివి. పైకి తేలినవి బొప్పాయి గింజలు. పంచదార ఉప్పులో కల్తీ జరిగితే నీటిలో వేయాలి. ఉప్పయినా ,పంచదార అయినా మంచివే అయితే నీళ్ళలో కరిగిపోతాయి కల్తీ అయితే అడుగున చాక్ పొడిలాగా పేరుకొని కరిగిపోకుండా ఉంటుంది. కరిగిన నేయిలో చక్కెర కలిపితే,ఐదు నిముషాల్లో అది ఎరుపు రంగు లో మారితే కల్తీ అయినట్లే.

Leave a comment