తెలిసింది మాత్రమే చేస్తే  మనం అక్కడే ఆగిపోతాం అంటుంది తమన్నా. ప్రపంచంలో అన్ని విషయాలు మనకు తెలియని నిభందన ఏవీ లేదు. చాలా విషయాల్లో కనీస పరిజ్ఞానం లేకుండా తెరపై నన్ను చూసుకోవాలని పరిశ్రమలోకి అడుగు పెట్టాను అయితే ప్రతి రోజు ఓ కొత్త విషయం తెలుసుకుంటు, నేర్చుకుంటూ నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. నాకు తెలిసింది మాత్రమే చేద్దామన్న ధోరణిలో నేనెప్పుడు ఉండను. రాదు, చేతకాదు అని కుడా అనను. నేర్చుకోవటం అందులో పట్టు సాధిచడం కుడా గొప్ప విషయమే కదా. నిజానికి నాకు అందులోనే సంతోషం వుంది అంటుంది తమన్నా. సినిమాకు సంభందించిన అన్ని విషయాల పైన ఇప్పుదిప్పుడే పట్టు సాధిస్తున్నా అంటుంది. నిజమే కదా నిలకడగా నిలబడాలంటే ముందు ఆ నిలబడటం కుడా నేర్చుకోవాల్సిందే కదా.

Leave a comment