Categories
WhatsApp

కూరగాయలు సరిగ్గా ఎంచుకోవాలి.

కూరలు కొనే విషయంలో ఒక రకంగా శిక్షణ తీసుకోవాల్సిందే. ఎదో ఒకటి అని కోనేయకూడదు. ఉల్లిపాయలు, బంగాలదుంపలు నిల్వ ఉంటాయి కనుక ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఉల్లిపాయ చేతిలోకి తీసుకుని బయటి పొట్టు సులువుగా విడివాడేలా వుంటే అని మంచివన్నట్లు లెక్క బంగాలదుంప పై చర్మంపై ఆకుపచ్చని రంగు వచ్చిన చిన్నచిన్న మొలకలు వచ్చిన వాటిని కొనకూడదు. దమ్ ఆలూకు బేబీ పోటాటోలు, బేకింగ్ కయితే పెద్ద దుంపలు ఎంపిక చేసుకోవాలి. క్యాబేజీ గట్టిగా పొరలు ప్యాక్ అయి వుండాలి. పై పోర బాగా అతుక్కుని టైట్ గా వుండాలి. అవి మంచివే కాదు రుచిగా ఉంటాయి. బెండకాయలు తోక విరిస్తే పెళునుగా విరిగి చేతిలోకి రావాలి. కాయి చిన్నగా కాయి చిన్నగా నుగుతూ నవనవ లాడాలి లోపలి గింజలు చిన్నగా వుండే కాయిలు బావుంటాయి. ఇలా ఒక్కో రకం కురగాయల్ని ఒక్కో విధంగా పరీక్ష చేసి ఎంచుకోవాలి.

Leave a comment