ఏనాడో ప్రాచీన కాలం నాటి లేస్ ఫ్యాషన్ లేటెస్ట్ ట్రెండ్. అయి కూర్చుంది. మోడ్రన్ అమ్మాయిలు మనసు పారేసుకునేలా చెవి రింగులు బ్రాస్ లెట్స్, ఉంగరాలు, నెక్లస్ లు కాలి పట్టీలు నెక్ చోకర్స్ చెప్పులు, గాజులు క్లచ్  ఇలా ఎన్నో రూపాల్లోకి లేస్  వెళ్లిపోయింది. లేసుల్లో ఎన్నో రకాలు చంటిల్లీ, గ్యుపూర్, క్రోబెట్ ఎంబ్రాయిడరీ. ఇలా ఎన్నో వీటిల్లో క్రోబెట్ లేస్ చాలా అందంగా వుంటుంది. వీటితో చేసిన చెవిరింగులు, కాలి పట్టాలు చక్కగా వున్నాయి. లేస్ చాలా సున్నితమైన అల్లిక పని దీని కాటాన్ దారాలతో సిల్క్ లెనైన్ దారాలతో అల్లుతారు. లేస్ తో చేసిన దుస్తులు జ్యూవెలరీ మంచి రంగులతో వుంటే ఆ అందమే అందం. ఒకప్పుడు చీర అంచులుగా వాడే లేస్ ఇప్పుడు ఏరకంగా గౌన్లుగా, ప్యాచ్ వర్కలుగా జ్యూవెలరీ మారి పోయి ఫ్యాషన్ ప్రపంచంలో చొటు చేసుకుంది.

Leave a comment