కొబ్బరి నీళ్ళు తాగి బొంద ఇచ్చేసి, అడ్డంగా కొట్టేసి లేత కొబ్బరి ఇస్తారు దుకాణ దారులు. ఆ లేలేత కొబ్బరి ఎంతో ఆరోగ్యం. కప్పు లేత కొబ్బరి లో ఏడు గ్రాముల డైటరీ పిచు వుంటుంది. అలాగే 283 క్యాలరీలు, పిండి పదార్ధాలు, చెక్కర, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీన్ని గర్భినిలు హ్యాప్పీ గా సందేహం లేకుండా తినొచ్చు. నీళ్ళు లాగే ఈ కొబ్బరి డి-హైడ్రేషన్ దూరం చేస్తుంది. పాలు కారే కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్లు కరిగే కొవ్వు ఉంటాయి. ఇవి త్వరగా శరీరంలో కలిసి మంచి పోషకాలు విడుదల చేస్తాయి. అవసరమైన శక్తిని అందజేస్తాయి. పోటాషియం, సోడియం కుడా లేత కొబ్బరి తో లభిస్తాయి. ఇవి శరీరానికి అందటం వల్ల రక్త పోతూ అదుపులో వుంటుంది. రక్తంలో పోటాషియం శాతం కూడా సమంగా వుంటుంది. ఇందులో విటమిన్-బి, ఫోలెట్లు తక్కువ. నీరసంగా వుంటే ఈ లేలేత కొబ్బరి తింటే వెంటనే ఉత్సాహం వస్తుంది. ప్రతి రోజు తిన్నా సమస్య వుండదు. సరిపడా పిచు కుడా లభిస్తుంది.
Categories