పాలు చక్కని మాయిశ్చరైజర్ అంటారు ఎక్సపర్ట్స్ .ఎండకు కమిలిన చర్మం సాధారణ స్థితికి వచ్చేందుకు మొటిమలు తగ్గించేందుకు పాలు దోహదపడతాయి.ఒక స్పూన్ గంధం పొడి లో పాలు కలిపి పేస్టులాగా చేసి దాన్ని మొహానికి రాసి 15 నిమిషాలు ఆరిపోయే దాకా ఉంచి కడిగేస్తే పాలలో ఉండే విటమిన్ల్ ద్వారా పోషకాలు అంది చర్మం హైడ్రేడ్ అవుతుంది. తేనె, నిమ్మరసం, పాలు కలిపిన పేస్ట్ మొహానికి రాసుకుంటే ఇది ప్రకృతి సిద్ధమైన బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది. ముల్తానా మట్టి లో పాలు కలిపి ప్యాక్ వేసుకుంటే మృదువైన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

Leave a comment