వాషింగ్ మిషన్స్ వచ్చాక గృహిణి కి సగం శ్రమ తగ్గిపోయింది. ఇంతగా ఉపయోగ పడే వాషింగ్ మిషన్లు అన్ని రకాల దుస్తులు వేసేస్తే రంగులు అన్నింటికీ అంటుకోవడం కాకుండా జీన్స్ వంటివి వేస్తే ముందు పోగులు పాడై వస్త్రం రంగు మారిపోతుంది. గంటల తరబడి నానపెట్టి ఉతుకుతుంటే కూడా రంగు వెలుస్తుంది. ఉతికే నీటిలో ఓ చెంచా ఉప్పు వేస్తే ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే సాక్సులున్ని మిషన్ లో వేస్తే సాగి గట్టి తనం పొందుతుంది. జిప్పులు వున్న ఏ దుస్తులైనా మిషన్ లో వేస్తే డ్రయర్ లో కి వచ్చే సరికి అవి పాడవుతాయి. టుర్కి టవల్స్ కూడా అంతే ఎక్కువ సేపు నానబెట్టినా పాడవుతాయి మిషన్ లో వేసినా పోగులు వూడి వచ్చి చాలా తొందరగా పాతవిగా అయిపోతాయి. మిషన్ లో వేసే ముందే బట్టల్ని విడదీసి బరువైనవి పొడవైనవి, రంగు అన్తుకోనివిగా చూసి పెట్టుకోవాలి.
Categories