కలిగిన వాడికి అందరు బంధువులే అన్నట్లు అన్న సామెత నిజంగానే అనుభవ సారంలోంచి పుట్టిందే డబ్బున్న వాళ్ళ చుట్టు ఎందరో ఆశ్రతులు ఉంటారు.. డబ్బు అవసరం ప్రతి వాళ్ళను ధనికులకు బంధువులను చేస్తుంది. వాళ్ళలో బంధుత్వం కలుపుకొనేందుకు అందరు ఇష్టపడతారు. డబ్బుతో అవసరం లేనిది ఎవరికీ ? ఏదో ఒక రోజు డబ్బు అవసరం వస్తే ఆదుకోకపోతారా అని కలిగిన వాళ్ళను ఎవ్వరు నొప్పించకుండా జాగ్రత్తగా స్నేహంగా ఉంటారు. ధనికులకు అందరు చుట్టాలే. అనే సామెత ఇలాగే వచ్చింది.
* కలిమి లేములు కావడి కుండలు.
* కల్ల పసిడి కి కాంతి ఎక్కువ.
* కష్ట సుఖాలు కావడి కుండలు.
* కల్ప వృక్షం కింద గడ్డి పొర ఉన్నట్లు.
సేకరణ
సి.సుజాత